ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవిత కథ ఆధారంగా మహి. వి. రాఘవ్ తెరకెక్కించిన సినిమా యాత్ర 2.
సుమారు ఐదేళ్ల క్రితం దివంగత సీఎం వైఎస్సార్ పాత్రలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించన యాత్ర 1 సినిమాకు సీక్వెల్ ఇది.
యాత్ర 2 సినిమాలో జగన్ పాత్రలో తమిళ హీరో జీవా జీవించాడు. ఏపీ ఎన్నికల నేపథ్యంలో భారీ అంచనాలతో ఫిబ్రవరి 8న థియేటర్లలో విడుదలైన మంచి టాక్ తెచ్చుకుంది.
యాత్ర 1 తో పోలిక రావడంతో యాత్ర 2పై అంచనాలు మరీ ఎక్కువయ్యాయి. దీంతో ఈ పొలిటికల్ డ్రామా కేవలం ఒక మోస్తరు వసూళ్లతోనే సరిపెట్టుకుంది.
ఎలాంటి కాంట్రవర్సీలకు చోటివ్వకుండా కేవలం సీఎం జగన్ జీవితంలోని ఆసక్తికర అంశాలను స్పృశిస్తూ యాత్ర 2 ను తెరకెక్కించారు.
అయితే ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో సీఎం జగన్ బయోపిక్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది.
ఈ నేపథ్యంలో మార్చి 15 నుంచి యాత్ర 2 సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని టాక్ వినిపిస్తోంది. అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.