TV9 Telugu
23 February 2024
బిగ్ బాస్ ఫేమ్ నయని పావని - ప్రిన్స్ యావర్ లవ్ ట్రాక్ పై క్లారిటీ.
సోషల్ మీడియా ద్వారా చాలా మంది విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న వారిలో బిగ్ బాస్ ఫేమ్ నయని పావని ఒకరు.
ఈ చిన్నదానికి సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది. ఫోటోషూట్స్ తో అందాలు ఆరబోస్తూ కవ్విస్తుంది ఈ ముద్దుగుమ్మ.
ఒక టైం లో ఢీ లో మెరిసిన పావని ఆ క్రేజ్ తోనే ఇండియాస్ బిగెస్ట్ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ సీజన్ 7 ఛాన్స్ అందుకుంది నయని పావని.
బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నయని పావని పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంది. అలాగే ప్రిన్స్ యావర్ తో కలిసి ఎక్కువగా కనిపించింది.
దాంతో ఈ ఇద్దరూ ప్రేమలో పడ్డారని వార్తలు పుట్టుకొచ్చాయి. తాజాగా ఈ వార్తల పై క్లారిటీ ఇచ్చింది నయని పావాని.
రీసెంట్ గా తన ఫాలోవర్స్ తో ముచ్చటించింది ఈ చిన్నది. ఈ క్రమంలో నెటిజన్స్ యావర్ తో ప్రేమలో ఉన్నావా.? అని అడిగాడు.
దానికి అమ్మడు స్పందిస్తూ.. ఎర్రేయ్ ఏంట్రా మీరు.? మా మధ్య అలాంటిది ఏం లేదు మేము ఫ్రెండ్స్ మాత్రమే అంటూ ఆన్సర్ ఇచ్చింది..?
ఇప్పటికే నెట్టింట ఈ ఇద్దరూ ప్రేమలో ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు నయని పావని కాస్త గట్టిగానే క్లారిటీ ఇచ్చింది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి