ఓటీటీ ఒణుకు పుట్టిస్తున్న హారర్ అండ్ క్రైమ్ సస్పెన్స్ సినిమా
TV9 Telugu
14 June 2024
ఈ మధ్య కాలంలో హారర్ అండ్ క్రైమ్ జోనర్ సినిమాలకు ఫుల్ ఫ్యాన్ బేస్ పెరిగిపోయింది. ఆకట్టుకునే ట్విస్టులతో తెరకెక్కిస్తే బొమ్మ బ్లాక్ బస్టర్ అవడం ఖాయం.
అయితే ఇలాంటి తరహాలో సినిమాలు వస్తున్నాయంటే ప్రేక్షకులు కచ్చితంగా చూసేందుకు ఇష్టపడుతుంటారు. క్యూరియాసిటీతో మూవీని అటెంప్ట్ చేస్తారు.
అందుకే హారర్ అండ్ క్రైమ్ సస్పెన్స్ చిత్రాలకు ఎప్పుడు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుంటారు. అలాంటిది హారర్ అండ్ క్రైమ్ రెండు మిక్స్ అయి సినిమా వస్తే.
అవును అలాంటి సినిమానే మిరల్. రెండేళ్ల క్రితం అంటే 2022 నవంబర్ 11న థియేటర్లలో తమిళంలో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.
ప్రేమిస్తే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన భరత్ నటించిన మరో ఇంట్రెస్టింగ్ మూవీనే మిరల్. ఈ సినిమాను యాక్సెస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ సంయుక్తంగా తెరకెక్కించారు.
ఇటీవల తెలుగు థియేట్రికల్ కోసం విడుదల చేసిన ట్రైలర్ ఎంతగా భయపెట్టిందో అందరికీ తెలిసిందే. ట్రైలర్‌తో ఒక్కసారిగా మిరల్ మూవీ మీద అంచనాలు పెరిగాయి.
ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో మిరల్ సినిమా జూన్ 7 నుంచి స్ట్రీమింగ్ అవ్వగా అందరిని ఆకట్టుకుంటుంది.