కేజీఎఫ్ విక్రమ్‌కి కలిసొస్తుందా.? విక్రమ్ కి ప్లాన్ అదేనా.?
21 October 2023
కేజీఎఫ్ కన్నడ సినిమాకు జాతీయ స్థాయి గుర్తింపు తీసుకు వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా. పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ అయ్యి హీరో ప్రజెంటేషన్ విషయంలో కొత్త ట్రెండ్ సెట్ చేసింది.
అందుకే ఇప్పుడు ఇదే థీమ్‌తో రెండు సినిమా చేస్తున్నారు ఓ కోలీవుడ్ స్టార్ హీరో. రీసెంట్‌గా పొన్నియిన్ సెల్వన్ సినిమాతో బిగ్ హిట్ అందుకున్నారు వర్సలైట్ స్టార్ విక్రమ్.
చాలా రోజులుగా సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న విక్రమ్ కోరిక తీర్చింది పీఎస్ 1. అదే జోష్‌లో మరో బిగ్ మూవీకి రెడీ అవుతున్నారు ఈ టాప్ హీరో.
ఇప్పటికే పా రంజిత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ 3డీ సినిమాను ఎనౌన్స్ చేశారు. ఇప్పుడు ఈ సినిమా కాన్సెప్ట్‌కు సంబంధించిన న్యూస్ ఫిలిం సర్కిల్స్‌లో వైరల్ అవుతోంది.
విక్రమ్ నెక్ట్స్ మూవీ తంగలాన్‌లో కేజీఎఫ్ రిఫరెన్స్‌లు కనిపించబోతున్నాయి. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలోనే ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు.
19వ శతాబ్దంలో జరిగే కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. మేజర్ పార్ట్ షూటింగ్ కూడా కేజీఎఫ్ షూటింగ్ చేసిన కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లోనే చేశారు.
తంగలాన్ తరువాత చేయబోయే సినిమాను కూడా కేజీఎఫ్ బ్యాక్‌డ్రాప్‌లోనే ప్లాన్ చేస్తున్నారు విక్రమ్.
చిన్నా ఫేమ్ ఎస్‌యు అరుణ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న మూవీని కూడా కేజీఎఫ్ బ్యాక్‌డ్రాప్‌లోనే ప్లాన్ చేస్తున్నారు.
ఇప్పటికే కేజీఎఫ్ థీమ్ రెండు సార్లు ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఇప్పుడు అదే థీమ్‌తో మరో రెండు సినిమాలు తెరకెక్కుతుండటం ఆసక్తికరంగా మారింది.
కేజీఎఫ్ సినిమాలో నరాచీతో బాగా కనెక్ట్ అయ్యారు ఆడియన్స్. మరి విక్రమ్ సినిమాల్లో ఈ బ్యాక్‌డ్రాప్‌ను ఎలా చూపిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.