పొలిశెట్టి సినిమాకు మెగాస్టార్ ఫస్ట్ రివ్యూ..

07 September 2023

ట్విట్టర్ వేదికగా...'మిస్ శెట్టి - మిస్టర్ పోలిశెట్టి' మూవీకి డీటెయిల్‌గా రివ్యూ కూడా ఇచ్చారు చిరు. మరో సారి తనేంటో .. తన నేచర్‌ ఏంటో అందరికీ తెలిసేలా చేశారు.

'మిస్ శెట్టి - మిస్టర్ పోలిశెట్టి' చూశాను.. మొదటి నుంచి చివరి దాకా ఎంతగానో ఆకట్టుకున్న హిలేరియస్ ఎంటర్టైనర్.

నేటి యువత ఆలోచనా విధానాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ తీసుకున్న సరికొత్త కధాంశం, 'జాతి రత్నాలు' కి రెట్టింపు ఎనర్జీ ని, వినోదాన్ని అందచేసిన నవీన్ పోలిశెట్టి.

కొంచెం గ్యాప్ తర్వాత కనిపిస్తున్నా మరింత అందంగా, బ్యూటిఫుల్ గా వున్న మనందరి 'దేవసేన', అనూష్క శెట్టి లు ఈ చిత్రానికి ప్రాణం పోశారు.

ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ అవటంతో పాటు ఎమోషన్స్ ని కూడా అద్భుతంగా మిక్స్ చేసి రక్తి కట్టించేలా రూపుదిద్దిన డైరెక్టర్ Mahesh Babu ని అభినందించాల్సిందే.

ఈ చిత్రానికి తొలి ప్రేక్షకుడ్ని నేనే.. ఆ హిలేరియస్ మూమెంట్స్ ఎంతగానో ఎంజాయ్ చేశాను. మరోసారి థియేటర్ లో ప్రేక్షకులందరి తోనూ ఎంజాయ్ చేయాలన్న బలమైన కోరిక నాకు కలిగింది.

మిస్ శెట్టి - మిస్టర్ పోలిశెట్టి 100% ఆడియన్స్ ని నవ్వుల బాట పట్టిస్తారనటంలో సందేహం లేదు అంటూ మెగా స్టార్ చిరు తన ట్వీట్‌లో కోట్ చేశారు.

సినిమా చూసిన తాను పొందిన ఎగ్జైట్ మెంట్ ను ఫీలింగ్‌ను అందరితో షేర్ చేసుకున్నారు. దాంతో పాటే.. ఒక్క సారిగా ఈ సినిమాపై అంచనాలను పెంచేశారు చిరు.