TV9 Telugu
'విశ్వంభర' అప్డేట్.. బొమ్మరిల్లు రీ రిలీజ్..
25 Febraury 2024
మెగాస్టార్ చిరంజీవి హీరోగా బింబిసారా ఫేమ్ వశిష్ట తెరకెక్కిస్తున్న తెలుగు సోషియో ఫాంటసీ సినిమా 'విశ్వంభర'.
ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఇప్పటికే మారేడుమిల్లి..హైదరాబాద్ కొన్ని ప్రాంతాల్లో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు.
ఫిబ్రవరి 26 నుంచి విశ్వంభర సెట్‌లో జాయిన్ కానున్నారు మెగాస్టార్. త్రిష సహా పలువురు యాక్టర్స్ కూడా ఈ షెడ్యూల్‌లో ఉంటారు.
ఆదికేశవలో విలన్‌గా నటించిన మలయాళీ నటుడు జోజు జార్జ్ హీరోగా నటించిన ఆంటోనీ సినిమా గతేడాది విడుదలైంది.
తాజాగా ఈ సినిమా తెలుగు వర్షన్‌ను ఆహాలో ఫిబ్రవరి 23న విడుదల చేసారు. హలో ఫేమ్ కళ్యాణి ప్రియదర్శన్ ఇందులో కీలక పాత్రలో నటించారు.
టాలీవుడ్‌లో ఎలాగూ రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తుంది. అందుకే సిద్ధార్థ్ పుట్టిన రోజు సందర్భంగా బొమ్మరిల్లు సినిమాను మరోసారి విడుదల చేస్తున్నారు.
ఏప్రిల్ నెలలో హీరో సిద్దార్థ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాను రీ రిలీజ్ చేయబోతున్నారు మూవీ మేకర్స్.
ఈ మధ్యే వాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 24న ఓయ్ సినిమాను రీ రిలీజ్ చేసారు. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి