TV9 Telugu

విశ్వంభర షూటింగ్ అప్‌డేట్.. దానిపై స్పందించిన కృష్ణవంశీ..

14 Febraury 2024

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమా విశ్వంభర. ఈ సినిమా షూటింగ్‌ గుంటూరు కారం సెట్లో శర వేగంగా జరుగుతోంది.

చిరంజీవి, త్రిషతో పాటు కీలక పాత్రధారులందరూ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుదల కానుంది.

కోలీవుడ్ హీరో జీవా, మమ్ముట్టి కీలక పాత్రల్లో మహి.వి.రాఘవ్‌ తెరకెక్కించిన పొలిటికల్ థ్రిల్లర్ సినిమా యాత్ర2.

ఈ సినిమా నుంచి భగ భగ మండే సూర్యుడు రా అనే పాటను విడుదల చేశారు మేకర్స్. ఏపీ సీఎం జగన్‌ పాదయాత్రను ప్రస్తావిస్తూ సాగే పాట ఇది.

తన ఆరోగ్యం కుదుటపడిందని అన్నారు ప్రముఖ నటుడు మిథున్‌ చక్రవర్తి. ప్రధాని మోదీ ఫోన్‌ చేసి పరామర్శించడం ఆనందంగా అనిపించిందని చెప్పారు.

ఇక నుంచి జాగ్రత్తగా ఉంటానని, ఆహారపు అలవాట్లను నియంత్రించుకుంటానని అన్నారు హిందీ నటుడు మిథున్‌ చక్రవర్తి.

శ్రీఆంజనేయం సినిమా ఆడకపోవడం గురించి నెటిజన్లు చేసిన కామెంట్‌కు దర్శకుడు కృష్ణవంశీ స్పందించారు. ప్రేక్షకుల తప్పు ఎప్పుడూ ఉండదు.

వారికి సినిమా నచ్చలేదంటే ఎక్కడో పొరపాటు జరిగి ఉంటుందని అన్నారు. శ్రీ ఆంజనేయం విషయంలో కొన్ని విషయాల్లో తన తప్పు ఉండొచ్చని అన్నారు.