ఇన్నేళ్ల తర్వాత మళ్లీ చిరుకి జోడిగా.. రాజధాని ఫైల్స్ ట్రైలర్..

TV9 Telugu

06 February  2024

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సోసియో ఫాంటసీ చిత్రం విశ్వంభరలో త్రిష హీరోయిన్‌గా ఫైనల్ అయ్యారు.

వశిష్ట దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో త్రిష కథానాయకిగా నటిస్తున్నారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది.

ఇప్పుడు అంత అనుకున్నదే నిజమైంది. చిరంజీవి, త్రిష జోడిగా కలిసి 18 ఏళ్ళ క్రితం స్టాలిన్ సినిమాలో నటించారు.

ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు విశ్వంభరలో మళ్ళీ కలిసి నటిస్తున్నారు. తాజాగా ఈమె సెట్స్‌కు వచ్చిన వీడియోను విడుదల చేసారు దర్శక నిర్మాతలు.

అఖిలన్, వీణ, వినోద్ కుమార్ ప్రధాన పాత్రల్లో భాను దర్శకత్వంలో వస్తున్న తాజా పొలిటికల్ సినిమా రాజధాని ఫైల్స్.

ఆంధ్రాలో అమరావతి ప్రాంతంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించినట్లు తెలిపారు దర్శక నిర్మాతలు.

తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసారు మేకర్స్. ఈ ట్రైలర్ కి మంచి స్పందన వస్తుంది. ఈ చిత్రం ఫిబ్రవరి 15న విడుదల కానుంది.

మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా.. సీనియర్ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వర్ రావు ఎడిటింగ్ చేస్తున్నారు.