21 October 2023
భోళా శంకర్ తర్వాత రెస్ట్ మోడ్ ఆన్ చేసిన చిరు.. మెగా 157 ముందుకు..?
చిరంజీవి, వశిష్ట సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ఎంతవరకు వచ్చాయి..? అసలు మెగాస్టార్ నెక్ట్స్ సినిమా ఇదేనా.?
భోళా శంకర్ తర్వాత మచ్ నీడెడ్ బ్రేక్ తీసుకున్నారు చిరంజీవి. హడావిడిగా వెంటనే మరో సినిమా మొదలుపెట్టి..
పూర్తి చేసి సంక్రాంతికి రావడం అనేది కరెక్ట్ కాదని ఫిక్సైపోయాకే.. రెస్ట్ మోడ్ ఆన్ చేసారు చిరు. దానికితోడు కథ నచ్చక మెగా 156 పక్కనబెట్టి..
157ని ముందుకు తీసుకొచ్చారు. దీన్నిబట్టి భోళా ఫ్లాప్‌ను మెగాస్టార్ ఎంత సీరియస్‌గా తీసుకున్నారో అర్థమవుతుంది.
వశిష్ట సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ వచ్చి చాలా రోజులైంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌తో బిజీగా ఉన్నారు చిత్రయూనిట్.
నవంబర్ రెండో వారంలో పూజా కార్యక్రమాలు చేసి.. డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలని చూస్తున్నారు మేకర్స్.
ఈ లోపు వరుణ్ తేజ్ పెళ్లి కూడా పూర్తి కానుంది. దానికితోడు కాలికి సర్జరీ కావడంతో.. కొన్ని రోజులుగా విశ్రాంతి తీసుకుంటున్నారు చిరు.
మెగా 157లో విజువల్ ఎఫెక్ట్స్‌పై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు దర్శకుడు వశిష్ట. ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ పని చేయబోతున్నారు.
అంతేకాదు సెట్స్ కూడా భారీగానే వేస్తున్నారు. సినిమాలో ఎక్కువ భాగం సెట్లలోనే జరగబోతుందని.. బడ్జెట్‌లో సగం వీటికోసమే ఖర్చు చేయబోతున్నారు.
చిరంజీవి కూడా ఇందులో నెవర్ బిఫోర్ అవతారంలో కనిపించబోతున్నారు. సంక్రాంతి 2025 విడుదలకు ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి