వాల్తేరు వీరయ్య ఇచ్చిన జోష్ మొత్తాన్ని భోళా శంకర్ నీరు గార్చేసింది. ఒకే ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్.. బిగ్గెస్ట్ డిజాస్టర్ ఇచ్చారు చిరంజీవి.
గతంలోనూ చిరుకు ఫ్లాపులొచ్చాయి కానీ భోళాతో విమర్శలు కూడా బోనస్‌గా వచ్చాయి. దాంతో నెక్ట్స్ ప్రాజెక్ట్స్‌పై చాలా ఫోకస్ చేస్తున్నారు చిరు.
ముఖ్యంగా రీమేక్స్ లేకుండా చూసుకుంటున్నారు. ఇకపై ఫ్రెష్ స్టోరీస్‌తోనే దండయాత్రకు సిద్ధమవుతున్నారు చిరంజీవి.
మొన్న బర్త్ డే రోజు రెండు సినిమాలు కన్ఫర్మ్ చేసారు చిరంజీవి. అందులో ఒకటి తన కూతురు సుష్మిత గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్మెంట్స్‌కు.. మరోటి యువీ క్రియేషన్స్‌కు.
అయితే కూతురు బ్యానర్‌లో చేయాల్సిన సినిమాకు దర్శకుడి కష్టాలు వచ్చాయి. కళ్యాణ్ కృష్ణ చెప్పిన కథ నచ్చక.. కొత్త కథ రెడీ చేయాలని చిరు చెప్పినట్లు తెలుస్తుంది.
కళ్యాణ్ కృష్ణతో బ్రో డాడీ రీమేక్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతున్న వేళ.. ఈ ప్రాజెక్ట్ హోల్డ్‌లో పెట్టి వశిష్ట సినిమాను నవంబర్ నుంచి పట్టాలెక్కించాలని చూస్తున్నారు చిరంజీవి.
భారీ బడ్జెట్‌తో జగదేకవీరుడు అతిలోకసుందరి, అంజి తరహాలో దీన్ని సోషియో ఫాంటసీగా తెరకెక్కిస్తున్నారు వశిష్ట.
ఈ చిత్ర షూటింగ్ నవంబర్ నుంచి మొదలు కానుంది. ఈ లెక్కన మెగా 157 ముందొస్తుందన్నమాట.. ఆ తర్వాతే 156 రానుంది.