కోట్లు రెమ్యూనరేషన్ ఇచ్చినా.. అలాంటి పాత్రలకు చేయను: చిరు

TV9 Telugu

13 April 2024

మెగాస్టార్ చిరంజీవి ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నారు ఈ విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దాదాపు 150 కి పైగా సినిమాల్లో నటించి ఎంతోమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నారు చిరు. తన ఫ్యామిలీలో చాలామందిని హీరోలుగా మార్చేశారు.

ఇలా ఎన్నో రకాల  విభిన్న పాత్రలో నటించిన చిరు.. ఇప్పటిదాకా మనకి ఒక్క సినిమాలో కూడా జబ్బు ఉన్నటువంటి వ్యక్తి పాత్రలు అసలు నటించలేదు.

కొన్ని కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అదనంగా ఇచ్చినా కూడా ఇటువంటి పాత్రలో తాను నటించమని క్లియర్ కట్ గా చెప్పేసారు చిరు. దాని కారణం ఏంటంటే ??

 తను తల్లి అంజనదేవికి తన కొడుకులంటే ఎంతో ఇష్టం తన కొడుకులు ఏదైనా జబ్బుతో బాధపడుతున్నట్లు కనుక ఆమె చూశారంటే అసలు తట్టుకోలేరట.

 ఇలాంటి జబ్బు ఉన్నటువంటి వ్యక్తి  పాత్రలు చేస్తే తన తల్లి అంజనదేవి బాధపడుతుంది అలాంటి పాత్రలకు నో చెప్పేశారంట చిరు.

 కొన్ని కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ని అదనంగా ఇచ్చినా కూడా ఎప్పుడూ చిరంజీవి ఇటువంటి పాత్రలు చేయరని చెప్పారు. అందుకే అలాంటి పాత్రలు చిరుకు రాయరు.

ఈ వయసులో కూడా సినిమాల్లో చిరంజీవి జోరు ఏ మాత్రం తగ్గలేదు చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాలో నటిస్తున్నారన్న విషయం తెలిసిందే.