గవర్నర్‌తో చిరంజీవి దంపతులు.. ట్రేండింగ్ లో గుంటూరు కారం వీడియో సాంగ్..
TV9 Telugu
12 February 2024
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవిని ఘనంగా సత్కరించారు.
తాజాగా హీరో చిరంజీవి, సురేఖ దంపతులు గవర్నర్ ని కలవడానికి హైదరాబాద్ నగరంలో ఉన్న రాజ్‌భవన్‌కు విచ్చేసారు.
ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై వాళ్లకి సాదరంగా ఆహ్వానం పలుకగా.. చిరంజీవి గవర్నర్‌కు పుష్పగుచ్ఛం అందించారు.
చిరు ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమాలో నటిస్తున్నారు. ఇదే వచ్చేది ఏడాది సంక్రాంఠీ కనుకగా విడుదల కానుంది.
మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన గుంటూరు కారం సంక్రాంతి పండగకి విడుదలై విజయం సాధించింది.
గుంటూరు బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా 200 కోట్లకు పైగా వసూలు చేసిందని తెలిపారు దర్శక నిర్మాతలు.
ఈ మధ్యే సినిమా నుంచి విడుదలైన కుర్చీ మడతబెట్టి పాటకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. ఈ వీడియో సాంగ్‌కు అప్పుడే 25 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
వీటితో పటు ఓ మై బేబీ, ధూమ్ మసాలా వీడియో సాంగ్స్ కూడా విడుదలయ్యాయి. ఇవి ప్రస్తుతం ట్రేండింగ్ లో ఉన్నాయి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి