TV9 Telugu

అమెరికాలో చిరు.. పుష్ప గురించి బన్నీ క్రేజీ అప్డేట్..

20 Febraury 2024

చిరంజీవి ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఆయన ప్రియ మిత్రుడు కుమార్ కోనేరు కుమారుడు కిరణ్ కోనేరు, శైల్య శ్రీల వివాహ వేడుకలో కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.

ఈ వేడుకలో వెంకటేష్ కూడా సతీ సమేతంగా పాల్గొన్నారు. అల్లు అరవింద్, మైత్రి నిర్మాతలు, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ కూడా ఈ వేడుకలో భాగం అయ్యారు.

పెళ్లికి వారం రోజులు కూడా లేదు.. కానీ బయట ఫోటోషూట్స్ మాత్రం ఇంకా చేస్తూనే ఉన్నారు రకుల్ ప్రీత్ సింగ్.

ఓ ప్రముఖ మ్యాగజైన్ కవర్ పేజీపై చేసిన ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే ఫిబ్రవరి 22న పెళ్లి చేసుకోబోతున్నారు రకుల్.

వినాయక్ దేశాయ్, అపర్ణా దేవీ జంటగా గోనాల్ వెంకటేష్ నిర్మించిన ప్రేమ కథా చిత్రం ‘రాధా మాధవం’. దాసరి ఇస్సాకు ఈ సినిమాకు దర్శకుడు.

తాజాగా ఈ చిత్ర సెన్సార్ పూర్తైంది. దీనికి యు/ఏ సర్టిఫికేట్ ఇచ్చారు సెన్సార్ సభ్యులు. మార్చ్ 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది రాధా మాధవం.

ప్రస్తుతం జర్మనీలో జరుగుతున్న బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉన్నారు అల్లు అర్జున్. అక్కడే పుష్ప 2ను ప్రమోట్ చేస్తున్నారు. పైగా పుష్ప 3 ఉంటుందని కన్ఫర్మ్ చేసారు.

దానికోసం ప్రత్యేకంగా కొన్ని ఐడియాలు కూడా ఉన్నాయని తెలిపారు బన్నీ. ఫిల్మ్ ఫెస్టివల్‌లో పుష్పను స్క్రీన్ చేయడంతో ఆనందంగా ఉన్నారు అల్లు అర్జున్.