సిద్ధార్థ్‌ చిన్నా ట్రైలర్ విడుదల.. మేడం చీఫ్ మినిస్టర్ షూటింగ్‌..

02 October 2023

సిద్ధార్థ్‌, నిమిషా సజయన్ జంట‌గా నటిస్తున్న కొత్త సినిమా చిత్తా సినిమాను తెలుగులో చిన్నా పేరుతో తీసుకొస్తున్నారు.

సేతుప‌తి సినిమా ఫేమ్ అరుణ్ కుమార్ దీనికి దర్శకుడు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు.

ఈ చిత్రన్ని సిద్ధార్థ్‌ సొంతంగా నిర్మిస్తున్నారు. ధిబు నినాన్ థామస్ ఈ చిత్రానికి స్వరాలందిస్తున్నారు.

టక్కర్ చిత్రం తర్వత సిద్ధార్థ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ఇది. అయితే ఈ చిత్రం కోసం కొన్నాళ్లు వేచి ఉండాలి.

SRP ప్రొడక్షన్ బ్యానర్ మీద తెరకెక్కనున్న మేడం చీఫ్ మినిస్టర్ సినిమా షూటింగ్‌ ఘనంగా ప్రారంభం అయింది.

రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గనుల శాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి సెప్టెంబర్ 30న ప్రారంభించారు.

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోంది అని మంత్రి అన్నారు.

డా. సూర్య రేవతి మెట్టకూరు ప్రధాన పాత్రలో కనిపించనుంది. ఆమె స్వయంగా దర్శకత్వం వహిస్తూ.. నిర్మిస్తోంది.