అవంతిక వందనపుపై మరోసారి ట్రోలింగ్..

TV9 Telugu

12 April 2024

అవంతిక వందనపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు తెలుగు చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ప్రస్తుతం అవంతిక హాలీవుడ్ చిత్రసీమలో ఫుల్ బిజీగా ఉంది.. ఇంగ్లీష్ లో ఆమె నటించిన ఒక్కో చిత్రం రిలీజ్ కు రెడీ అవుతున్నాయి.

అవంతిక వందనపు  చివరిగా ‘మీన్ గర్ల్స్ - ది మ్యూజికల్’ అనే చిత్రంతో అలరించింది. ఈ మూవీ ఓటీటీ వేదికన విడుదలైంది. 

మీన్ గర్ల్స్ - ది మ్యూజికల్ చిత్ర ప్రమోషన్ సమయంలో అవంతిక వందనపు ఇంగ్లీష్ యాసకు పలువురు ట్రోల్ చేశారు.

ఇప్పుడు నెక్ట్స్ ఆమె నటించబోయే చిత్రంపై ఇంట్రెస్టింగ్ న్యూస్ అందగా.. మళ్లీ ఆమెను టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.

 ఇప్పుడు అవంతిక వందనపు నెక్ట్స్ చేయబోయే సినిమాలో డిస్నీ ఫేమస్ క్యారెక్టర్ ‘రపుంజెల్’ పాత్రలో నటించబోతుందని తెలుస్తోంది.

అయితే ఆ పాత్రలో తెల్లగా ఉన్న వారే నటించాలని, అవంతిక వద్దు అంటూ ఆమె స్కిన్ కలర్ పై ట్రోల్ చేస్తున్నారు.