ఈ ఫోటోలు చూస్తే జై బాలయ్య అనాల్సిందే..

TV9 Telugu

10 June 2024

10 జూన్ 1960న సీనియర్ ఎన్టీఆర్, బసవతారకం దంపతులకు తమిళనాడు చెన్నైలో జన్మించారు నందమూరి నటసింహ బాలకృష్ణ.

64 ఏళ్లు వయసు వచ్చిన ప్రేక్షకులకి గూస్ బంప్స్ తెప్పించే మాస్ సినిమాలు చేస్తూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు.

బాలకృష్ణ తన తండ్రి ఎన్.టి.రామారావు దర్శకత్వం వహించిన తాతమ్మ కల సినిమాలో బాలనటుడిగా తొలిసారిగా నటించారు.

దాన వీర శూర కర్ణ, శ్రీ మద్విరాట పర్వం, అక్బర్ సలీం అనార్కలి, శ్రీ తిరుపతి వేంకటేశ్వర కళ్యాణంతో సహా తన తండ్రితో అనేక చిత్రాల్లో నటించారు.

దాన వీర శూర కర్ణ సినిమాలో అభిమన్యుడిగా ఆకట్టుకున్నారు. అభిమన్యుడి తండ్రి అర్జునుడి పాత్రలో బాలయ్య సొంత అన్నయ్య హరికృష్ణ నటించారు.

1984లో సాహసమే జీవితంతో హీరోగా అరంగేట్రం చేసారు. అదే మంగమ్మగారి మనవడు అనే చిత్రంలో భానుమతి, సుహాసినిలతో కలిసి నటించారు.

అప్పటినుంచి ఇప్పటివరకు 108 సినిమాలతో ప్రేక్షకులను మెప్పించారు. ప్రస్తుతం 109వ చిత్రం బాబీ దర్శకత్వంలో చేస్తున్నారు.

1982లో తెలుగుదేశం పార్టీ (టిడిపి)ని స్థాపించినప్పటి నుండి బాలకృష్ణ ప్రతి ఎన్నికలలో కోసం ప్రచారం చేసారు బాలయ్య.

2014 నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో పోటీ చేసిన 3 సార్లు హిందూపూర్ అసెంబ్లీ స్థానం కైవసం చేసుకున్నారు.