రామ్ చరణ్ తో జాన్వీ రొమాన్స్

TV9 Telugu

10 March 2024

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న 'ఆర్సీ 16' సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుందనే అఫీషియల్ న్యూస్  బయటికి వచ్చింది.

దీనితో సోషల్ మీడియా అంతటా ఈ విషయం హాట్ టాపిక్ అయింది. దాంతో పాటే సినిమాపై తెలియని అంచనాలను కూడా పెంచేసింది.

వీరి ఆన్‌ స్క్రీన్‌ కెమెస్ట్రీ చిరు, శ్రీదేవిలను మరిపిస్తుందా అనే కామెంట్ కూడా వచ్చింది. ఈ క్రమలోనే చిరు త్రో బ్యాక్ వీడియో ఒకటి  ఇప్పుడు వైరల్ అవుతోంది.

చిరంజీవి నటించిన ఖైదీ నెం.150 సినిమా విడుదల సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరు చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

జగదేక వీరుడు సినిమాను రామ్ చరణ్, శ్రీదేవీ కూతురు జాన్వీ కపూర్‌లతో రిమేక్ చేస్తూ బాగుందంటూ ఆ ఇంటర్వ్యలో చెప్పారు.

దాదాపు ఏడేళ్ల క్రితం చిరంజీవి చేసిన కోరిక అప్పట్లో కొత్తగా అనిపించింది ఇప్పుడు మరల నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. 

అయితే ఇప్పుడు రామ్ చరణ్ సరసన ఆర్ సీ 16లో జాన్వీ కపూర్ నటించనుండటంతో చిరు కామెంట్స్ కు నిజమయ్యాయనే కామెంట్ నెట్టింట వస్తోంది.