ఇప్పటిదాకా చంద్రముఖి కేరక్టర్‌ చేసిన హీరోయిన్స్..

27 September 2023

చంద్రముఖి కేరక్టర్‌కి కంగన ఎంత మాత్రం సెట్‌ అవుతారనే అనుమానాలు సినిమా స్టార్టింగ్‌ నుంచీ ఉన్న సంగతి తెలిసిందే.

కంగన

అయితే ఈ మధ్య రిలీజ్‌ అయిన ప్రమోషనల్‌ స్టఫ్‌ చూసిన వారు మాత్రం కంగన పర్ఫెక్ట్ అనే ఒపీనియన్‌కి ఓటేస్తున్నారు.

కంగన

తాను ఎంత కష్టపడి చేసినా, జ్యోతికను బీట్‌ చేయలేనన్న మాటను ఎప్పటి నుంచో చెబుతున్నారు కంగన. అంతలా జ్యోతిక ఇంపాక్ట్ జనాల మీద ఉందని అన్నారు.

కంగన

జ్యోతిక మాత్రమే కాదు, అంతకు ముందు చంద్రముఖి కేరక్టర్లు చేసిన వాళ్లందరూ కూడా నటనకు ఇంపార్టెన్స్ ఇచ్చిన నటీమణులే.

జ్యోతిక

కమర్షియల్‌ హీరోయిన్లుగా స్క్రీన్‌ మీద చెలరేగినప్పటికీ, పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్‌ మూవీస్‌కి ఫస్ట్ చాయిస్‌ అనిపించుకున్నవాళ్లే. తెలుగు నాగవల్లిలో చంద్రముఖిగా అనుష్క.

అనుష్క

మలయాళంలో చంద్రముఖి కేరక్టర్‌ చేశారు శోభన. అప్పట్లో ఆమె కేరక్టర్‌కి మలయాళం ఆడియన్స్ నుంచి మాత్రమే కాదు, మూవీ లవర్స్ అందరి నుంచీ అప్లాజ్‌ దక్కింది.

శోభన

కన్నడ ఆప్తమిత్రలో సౌందర్య పెర్ఫార్మెన్స్ ని అంత తేలిగ్గా మర్చిపోలేరు జనాలు. సహజనటి సౌందర్య కెరీర్‌లో గుర్తుండిపోయే కేరక్టర్లలో చంద్రముఖి కి ఇంపార్టెంట్‌ రోల్‌ ఉంది.

సౌందర్య

ఇప్పుడు చంద్రముఖి2 రిలీజ్‌ అయితే, కంగన పెర్ఫార్మెన్స్ ని ప్రీవియస్‌ హీరోయిన్లతో కచ్చితంగా పోల్చి చూస్తారు ఆడియన్స్.

కంగన