దేవునితో పాటు దెయ్యం.. ఆ రోజునే ప్రేక్షకులను భయపెట్టనున్న ‘చంద్రముఖి’..

2005లో ప్రేక్షకులను భయపెట్టిన చిత్రం ‘చంద్రముఖి’.

దీనికి కొనసాగింపుగా వస్తున్న చిత్రం ‘చంద్రముఖి 2’.

ఈ చిత్రంలో రాఘవ లారెన్స్‌ హీరోగా నటించారు.

ఈ చిత్రంలో ఓ ప్రధాన పాత్రలో కంగనా రనౌత్‌ కనిపించనుంది.

ఈ చిత్రాన్ని పి.వాసు తెరకెక్కిస్తున్నారు.

లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై సుభాస్కరన్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు.

కాగా ఈ చిత్రం వినాయక చవితికి ప్రేక్షకులను భయపెట్టనుంది.

గురువారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం.

ఈ మేరకు రాఘవ  లారెన్స్‌ ఫస్ట్‌లుక్‌ను కూడా విడుదల చేశారు మూవీ మేకర్స్.