ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్దమైన చంద్రముఖి 2..
22 October 2023
పి. వాసు దర్శకత్వంలో రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ ముఖ్య పాత్రల్లో చంద్రముఖికి కొనసాగింపుగా.. తెరకెక్కిన చిత్రం చిత్రముఖి 2.
ఈ సినిమాకి ఆస్కార్ గ్రహీత ఎంఎం కీరవాణి స్వరాలు అందించారు. లైకా ప్రొడక్షన్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది.
ఈ సినిమాలో వడివేలు, రావు రమేష్, రాధిక శరత్ కుమార్, లక్ష్మి మీనన్, మహిమా నంబియార్ తిదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.
ఈ ఏడాది సెప్టెంబర్ 28న భారీ అంచల మధ్య విడుదలైన చంద్రముఖి 2 సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది.
చంద్రముఖి 2 డిజాస్టర్ కావడంతో మేకర్స్ భారీ నష్టాలు చవిచూశారు. దీంతో ఈ చిత్రం ఓటీటీలో విడుదల చేసేందుకు సిద్ధం అయ్యారు.
ఈ నెల 26న డిజిటల్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ద్వారా ఓటీటీ ప్రేక్షకులను అలరించనుంది హారర్ సినిమా చంద్రముఖి 2.
సిల్వర్ స్క్రీన్ లో నష్టాలు మిగిల్చిన ఈ చిత్రం నెలరోజులు పూర్తి కాకుండానే డిజిటల్ లో విడుదలకు సిద్ధమైంది.
ఓటీటీలో అయినా చంద్రముఖి 2 చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందో.. లేక ఇక్కడ కూడా బోల్తా కొడుతుందో చూడాలి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి