హీరోగా, హాస్యనటుడిగా, సహాయ నటుడిగా ఎన్నో చిత్రాల్లో నటించిన చంద్రమోహన్ కొన్ని సినిమాల్లో ప్రతినాయకుడిగానూ మెప్పించారు
గత కొన్నాళ్లుగా గుండె, కిడ్నీ సంబంధిత మధుమేహం వ్యాధులతో బాధపడుతున్న ఆయన 82 ఏళ్ల వయసులో శనివారం ఉదయం కన్నుమూసిన సంగతి తెలిసిందే
చంద్రమోహన్ భార్య ప్రముఖ రచయిత్రి జలంధర. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు సంతానం. పెద్దకుమార్తె మధుర మీనాక్షి అమెరికాలో సైకాలజిస్ట్‌గా పనిచేస్తున్నారు
ఇక రెండో కుమార్తె మాధవి చెన్నైలో డాక్టర్‌గా పనిచేస్తున్నారు. ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ ఆయనకు స్వయానా మేనల్లుడు
చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్‌రావు. సినిమాల్లోకి వచ్చాక ఆయన పేరు చంద్రమోహన్‌గా మార్చుకున్నారు
‘రంగుల రాట్నం’ సినిమాతో మొదలైన ఆయన సినీ ప్రస్థానంలో దాదాపు 55 ఏళ్లకు పైగా 900లకు పైగా సినిమాల్లో నటించారు
వాటిల్లో 175 సినిమాల్లో హీరోగా నటించారు. మిగిలిన సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హాస్యనటుడిగా నటించారు. తమిళంలోనూ పలు సినిమాల్లో నటించారు
ఆయన చిరంజీవితో కలిసి నటించిన 'ప్రాణం ఖరీదు' చిత్రంలో మెగాస్టార్‌కు ఐదు వేలు పారితోషికం అందుకుంటే.. చంద్రమోహన్ మాత్రం రూ.25 వేలు పారితోషికంగా అందుకున్నారు