రెడ్ డ్రెస్ లో హంపి శిల్పంలా మెరిసిపోతున్న చాందిని..
07 October 2023
23 అక్టోబర్ 1993లో ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నంలో జన్మించింది అందాల తార చాందిని చౌదరి. ఈమెకు రంజని అని మరో పేరు కూడా ఉంది.
కర్ణాటకలోని బెంగుళూరులో ఓ కాలేజీలో మెక్నికల్ ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తీ చేసింది ఈ ముద్దుగుమ్మ.
సినిమాలకి ముందు బెంగుళూరులో చదువుతున్నప్పుడు చాలా షార్ట్ ఫిల్మ్‌లలో నటించి మెప్పించింది ఈ వయ్యారి భామ.
ప్రేమ ప్రేమ, లవ్ ఎట్ ఫస్ట్ సైట్, ట్రూ లవ్, అప్రోచ్, ప్రపోజల్, మధురం, సాంబార్ ఇడ్లీ, లక్కీ, టూ సైడ్ లవ్, ఫాల్ ఇన్ లవ్ ఈమె నటించిన కొన్ని షార్ట్ ఫిల్మ్స్.
యంగ్ హీరో రాజ్ తరుణ్‌తో కూడా కొన్ని లఘు చిత్రాలలో నటించింది ఈ బ్యూటీ.. వాటిలో ఒకటైన 'ది బ్లైండ్ డేట్' ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టింది.
2013లో మధురం అనే షార్ట్ ఫిల్మ్‌లో చాందినీ నటనను చూసిన ముళ్లపూడి వర, కె.రాఘవేంద్రరావులు ఆమెకు కుందనపు బొమ్మ చిత్రంలో అవకాశం ఇచ్చారు.
కొన్ని కారణాల వల్ల ఈ సినిమా జనవరి 2015లో మొదలైంది. ఈ గ్యాప్ లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ప్రేమ ఇష్క్ కాదల్, కేటుగాడు, బ్రహ్మోత్సవం చిత్రాల్లో కనిపించింది.
అయితే కేటుగాడు హీరోయిన్ గా ఆమెకు డెబ్యూ మూవీ. తర్వాత కొన్ని చిత్రాల్లో నటించిన ఆహాలో విడుదలైన కలర్ ఫొటోతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
తర్వాత ఓటీటీలో బొంభాట్, సూపర్ ఓవర్ చిత్రాల్లో నటించిన ఈ వయ్యారి.. కిరణ్ అబ్బవరంకి జోడిగా సమ్మతమే చిత్రంతో ఆకట్టుకుంది.