విజయ్ ఫ్యామిలీ స్టార్ సెన్సార్..

TV9 Telugu

05 April 2024

విజయ్ దేవరకొండ, దర్శకుడు పరశురామ్ కాంబినేషన్‌లో వస్తున్న యాక్షన్ కామెడీ ఫ్యామిలీ డ్రామా సినిమా ఫ్యామిలీ స్టార్.

ఇందులో టాలీవుడ్ సీతమహాలక్ష్మి మృణాల్ ఠాకూర్ కథానాయకిగా విజయ్ తో పక్కన నటించారు. దిల్ రాజు దీనికి నిర్మాత.

ఈ చిత్ర ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది.

దీనికి చిత్రయూనిట్ అంతా వచ్చారు. అంతేకాదు ప్రీ రిలీజ్ ఈవెంట్‌నే దేఖో రే దేఖో అంటూ సాగే లిరికల్ సాంగ్ విడుదల చేసారు.

ఈ సినిమా ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనికోసం ప్రేక్షకుల ఎంతో ఆసక్తిగా ఉన్నారు.

తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. దీనికి యు/ఎ సర్టిఫికెట్ ను ఖరారు చేసింది సెన్సార్ బోర్డు.

ఈ చిత్ర రన్ టైమ్ గురించి అధికారిక ప్రకటన చేసారు దర్శక నిర్మాతలు. 150 నిమిషాల అంటూ పోస్టర్ విడుదల చేసారు మేకర్స్.

ఇందులో మజిలీ మూవీ ఫేమ్ హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ ఓ కీలక పాత్రలో నటించింది. K. U. మోహనన్ సంగతం అందించారు.