వీరి లవ్‌స్టోరీస్‌.. తెరపైనే కాదు తెరవెనుకా హిట్టే!

February  14, 2024

TV9 Telugu

‘నేను’ అంటూ సాగిన వీరి ప్రయాణం మేముగా మారి మనం, మన జీవితం అంటూ సాగిన ఈ స్టార్‌ జంటల కహానీ మీరూ వినండి. స్నేహితులై.. ప్రేమికులై.. ఆపై దంపతులైన వీళ్ల లవ్‌ స్టోరీలు తెరపైనే కాదు తెరవెనుక కూడా సూపర్ హిట్టే..

‘భరత్‌ అనే నేను’, ‘వినయ విధేయ రామ’ చిత్రాలతో తెలుగు నాట గుర్తింపు తెచ్చుకున్న కియారా ఆడ్వాణి గత ఏడాది సహనటుడు సిద్ధార్థ్‌ మల్హోత్రాను ప్రేమ వివాహం చేసుకుంది

ఇద్దరికీ 12 ఏళ్లు తేడా ఉన్నా.. మా పదేళ్ల కాపురం... కష్టమైనా, సుఖమైనా ఒకరికొకరం తోడుగా నిలిచాం అదే మమ్మల్ని నడిపిస్తోందంటూ ఫహాద్‌ ఫాజిల్‌, నజ్రియా నాజిమ్‌ ఇద్దరూ మురిసిపోతున్నారు

బాలీవుడ్‌ క్యూట్‌ కపుల్‌ ఆలియా భట్‌, రణ్‌బీర్‌ కపూర్‌లది కూడా సక్సెస్‌ఫుల లవ్‌స్టోరీనే. మనసైన వాడు దొరికితే ఇన్నాళ్లూ ఇతనికోసమే వేచి ఉన్నానా అనిపిస్తుందని ఆలియా భర్తను పొగిడేస్తుంది

తెలుగు నటిగా రకుల్‌ ప్రీత్‌, బాలీవుడ్‌ నటుడు జాకీ భగ్నానీతో పీకల్లోతు ప్రేమలో పడింది. అతనొచ్చాక నా జీవితం మరింత అందంగా మారింది. ప్రేమకు నిర్వచనాలు చెప్పడం కష్టమే... కానీ, అదో అందమైన అనుభూతి. ఆ విషయం ప్రేమలో పడ్డాకే నాకర్థమైందంటోంది రకుల్‌

వంశీ సినిమాలో కలిసి నటించిన మహేశ్‌బాబు, నమ్రత శిరోద్కర్‌.. ప్రేమించుకుని ప్రేమ వివాహం చేసుకుని జీవితాన్ని పండించుకున్నారు

స్టార్ డైరెక్టర్‌ విఘ్నేశ్‌ శివన్‌, నయనతార ప్రేమ కహానీ అందరికీ తెలిసిందే. నేనూ రౌడీనే, కాతువాకుల రెండు కాదల్‌ సినిమాల్లో కలిసి పనిచేసిన వీరు ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు

వీరిలాగే వరుణ్‌తేజ్‌-లావణ్య త్రిపాఠి, సూర్య-జ్యోతిక, అజిత్‌-షాలినీ, విక్కీకౌశల్‌-కత్రినాకైఫ్‌, రణ్‌వీర్‌సింగ్‌-దీపికా పదుకొణె, ఆది పినిశెట్టి-నిక్కీ గల్రానీ.. జంటలు నిజ జీవితంలోనూ బెస్ట్ కపుల్‌గా నిలిచారు