సరిపోదా శనివారం నటీనటులు వేరే..
TV9 Telugu
30 July 2024
సరిపోదా శనివారం హీరోగా నటిస్తున్న నాని సూర్యగా, కథానాయకిగా చేస్తున్న కానిస్టేబుల్ చారులతగా నటిస్తున్నారు.
ఆర్. దయానంద్‌గా తమిళ దర్శకుడు, నటుడు ఎస్ జె సూర్య నటిస్తున్నారు. ఇంకా మిగిలిన ముఖ్య పాత్రధారులు ఎవరో చూద్దాం.
సరిపోదా శనివారం సినిమాలో టాలీవుడ్ సీనియర్ నటుడు సాయి కుమార్ శంకరం అనే ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.
అభిరామి గోపీకుమార్ ఈ సినిమాలో ఛాయాదేవి అనే ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈమె 20 సంవత్సరాల తర్వాత మళ్లీ తెలుగులో కనిపిస్తున్నారు.
ఇందులో ప్రముఖ నటుడు మురళి శర్మ కూడా నటిస్తున్నారు. ఈయన కుర్మానంద్ గా ఆకట్టుకోనున్నట్లు తెలిపారు మేకర్స్.
అలాగే నటుడు అజయ్ కూడా ఈ సినిమాలో కనిపించనున్నారు. ఈ మూవీలో గోవర్ధన్ అనే ఓ పాత్రలో ఈయన నటిస్తున్నారు.
తమిళ నటి అదితి బాలన్ ఈ సినిమాలో భద్ర పాత్రలో నటించనున్నారు. తెలుగు ఈమె రెండో చిత్రమిది. మొదట శాకుంతలంలో కనిపించింది.
అలాగే వరుస సినిమాలతో బిజీగా ఉన్న అజయ్ గోష్.. సరిపోదా శనివారంలో సినిమా నారాయణ ప్రభగా నటిస్తున్నారు.
నటుడు సుప్రీత్ ఈ సినిమాలో నారాయణ ప్రభ అనుచరుడు కాళీ పాత్రలో నటిస్తున్నారు. సాహూ తర్వాత మళ్లీ ఈ సినిమాలోనే కనిపిస్తున్నారు.
ఈ చిత్ర నిర్మాత దానయ్య తనయుడు కళ్యాణ్ దాసరి ఈ సినిమలో నారాయణ ప్రభ అనుచరుడు మార్టిన్ గా నటిస్తున్నారు.
అమృతం టెలివిజన్ సీరియల్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న హర్ష వర్ధన్ ఈ సినీ సుధా అనే ఓ పాత్రలో కనిపించనున్నారు.
అలాగే సీనియర్ నటుడు శుభలేఖ సుధాకర్ కూడా సరిపోదా శనివారంలో నటిస్తున్నారు. ఈయన కమలాకర్ గా కనిపించనున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి