లేడీ సూపర్ స్టార్‌ను వెంటాడుతున్న వివాదాలు.. చిక్కుల్లో నయన్..
TV9 Telugu
Pic credit - Instagram
లేడీ సూపర్ స్టార్ నయనతారను వివాదాలు వెంటాడుతున్నాయి. తాజాగా ఈ బ్యూటీపై మహారాష్ట్రలో కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది.
నయన్ నటించిన లేడీ ఓరియెంటెడ్ సినిమా అన్నపూరణి గతేడాది డిసెంబర్ 1న విడుదలైంది. అన్నపూరణి ది గాడెస్ ఆఫ్ ఫుడ్ ట్యాగ్ లైన్.
థియేటర్లలో విడుదల రోజు నుంచే పలు వివాదాలు చుట్టుముట్టాయి. దీంతో థియేటర్లలో అంతగా మెప్పించలేకపోయింది ఈ సినిమా.
కొద్ది రోజుల క్రితమే నెట్ ఫ్లిక్స్ లో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పుడు చిక్కుల్లో పడింది ఈ మూవీ.
ఈ సినిమాలోని కొన్ని డైలాగ్స్ హిందూవుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని.. రాముడిని కించపరిచారని శివసేన మాజీ లీడర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతేకాకుండా లవ్ జిహాద్ ను ప్రోత్సహించేలా ఉందని.. వెంటనే నిర్మాతలపై, ఓటీటీ సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని ముంబై పోలీసులను ఆశ్రయించారు.
అన్నపూరణి దర్శకుడు నీలేష్ కృష్ణ, నయనతార, నిర్మాతలతోపాటు నెట్ ఫ్లిక్స్ ఇండియాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని మహారాష్ట్ర హోంమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ను కోరారు.
హిందూసేవ పరిషత్ ఫిర్యాదు మేరకు అన్నపూరణి టీంతోపాటు నెట్ ఫ్లిక్స్ పైన జబల్ పూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే నెటిఫ్లిక్స్ ఈ చిత్రాన్ని తొలగించింది.