కెప్టెన్ మిల్లర్ వాయిదా.. లియో సెన్సేషన్..

09 November 2023

సల్మాన్ ఖాన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ టైగర్ 3 నవంబర్ 12న దివాళి సందర్భంగా విడుదల కానుంది. ఇందులో మొత్తం 12 ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉంటాయని తెలిపారు మేకర్స్.

ధనుష్ హీరోగా అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో వస్తున్న సినిమా భారీ యాక్షన్ సినిమా కెప్టెన్ మిల్లర్. ధనుష్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో వస్తుంది ఈ చిత్రం.

ప్రియాంక మోహన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ డిసెంబర్ 15న విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని ఇప్పుడు 2024 సంక్రాంతికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్.

లియో సినిమా రికార్డుల మోత మోగిస్తోంది. లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రం 2023 హైయ్యస్ట్ ఫస్ట్ డే గ్రాసర్‌గా నిలిచింది. తొలిరోజే 147 కోట్లు వసూలు చేసింది లియో.

ఇండియాలోనే కాదు ఓవర్సీస్‌లోనూ దుమ్ము దులిపేసింది లియో. ఓవర్సీస్ నుంచి 24.2 మిలియన్ డాలర్లు వసూలు చేసిందని ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ తాజాగా వెల్లడించారు.

విక్రాంత్ హీరోగా మెహ్రీన్ పిర్జాదా, రుక్సార్ హీరోయిన్స్‌గా నటిస్తున్న సినిమా స్పార్క్ ది లైఫ్. తాజాగా ఈ చిత్రం నుంచి రాధేశా అంటూ సాగే పాటను విడుదల చేసారు మేకర్స్.

ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా కొరటాల శివ తెరకెక్కిస్తున్న యాక్షన్ డ్రామా దేవర. రెండు భాగాలుగా ఈ సినిమా వస్తుంది. తాజాగా దీని నుంచి మేజర్ అప్‌డేట్ వచ్చింది.

రెండు వారాల నుంచి గోవాలో కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర గోవా షెడ్యూల్ పూర్తైంది. నెక్ట్స్ షెడ్యూల్ గోకర్ణలో ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు.