28 June 2024

అందాల అరాచకమే.. వయ్యారాలు ఒలకబోస్తున్న బ్యూటీని గుర్తుపట్టారా..? 

Rajitha Chanti

Pic credit - Instagram

మలయాళం ఇండస్ట్రీలో అందం, నటన, టాలెంట్‏తో అతి తక్కువ సమయంలోనే తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది హీరోయిన్ మాళవిక మోహనన్. 

దాదాపు పదేళ్ల క్రితమే మలయాళంలో పట్టం పోలే సినిమాతో కథానాయికగా సినీరంగంలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ ఫస్ట్ మూవీతో గుర్తింపు తెచ్చుకుంది.

ఆ తర్వాత తమిళంలో రజినీకాంత్ నటించిన పేట సినిమా.. విజయ్ దళపతి సరసన మాస్టర్ చిత్రాలతో కోలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యింది ఈ అందాల రాశి.

అలాగే స్టార్ హీరో ధనుష్ నటించిన మారన్ సినిమాతో ఈ వయ్యారికి మంచి ఫాలోయింగ్ వచ్చింది. అంతేకాకుండా హిందీలోనూ ఓ సినిమా చేసింది వయ్యారి.

తమిళం, మలయాళం, హిందీ భాషలలో పలు చిత్రాలు చేసినా మాళవిక.. ఇప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్క సినిమా కూడా చేయకపోడం గమనార్హం. 

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న రాజాసాబ్ మూవీలో కథానాయికగా నటిస్తుంది. ఇప్పటికే ఈ బ్యూటీ యాక్షన్ సీన్స్ నెట్టింట లీక్ అయిన సంగతి తెలిసిందే. 

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‏గా మాళవిక.. నిత్యం లేటేస్ట్ క్రేజీ ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్స్ పెంచుకుంటుంది. ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి. 

తెల్ల చీరకట్టులో వయ్యారాలు ఒలకబోస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఈ బ్యూటీ పోస్ట్ చేసిన ఫోటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు అభిమానులు.