అల్లు అర్జున్ గడ్డం తీసేసింది అందుకా?
TV9 Telugu
21 July 2024
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న క్రేజీ చిత్రం ‘పుష్ప 2’
సుమారు మూడేళ్ల క్రితం విడుదలై సంచలన విజయం సాధించిన పాన్ ఇండియా మూవీ పుష్పకు ఇది సీక్వెల్ పార్ట్.
కాగా ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న పుష్ప 2ఆగస్టు 15న విడుదల కావాల్సి ఉంది. అయితే డిసెంబర్ 6కు వాయిదా పడింది.
అయితే ఇంతలో పుష్ప 2 సినిమాపై చాలా రకాల రూమర్లు తెగ హల్ చల్ చేశాయి. అల్లు అర్జున్- సుకుమార్ లు గొడవ పడ్డరని టాక్ వినిపించింది.
ఈ క్రమంలోనే అల్లు అర్జున్ గడ్డం తీసేసి.. విదేశాలకు వెళ్లారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. తాజాగా వీటిపై బన్నీ వాసు స్పందించాడు.
అల్లు అర్జున్ క్లైమాక్స్, ఓ సాంగ్‌లో మాత్రమే నటించాలి. ఈ లోపు ఫహాద్ ఫాజిల్ క్యారెక్టర్‌కు సంబంధించి వర్క్ పూర్తి చేస్తాం'
'ఈ గ్యాప్‌లో ఫ్యామిలీతో కలిసి టూర్ వెళ్లేందుకు.. లెక్కలేసుకుని మరీ అల్లు అర్జున్ గడ్డం తీసేశారు. ఇదే అసలు నిజం' అని బన్నీ వాసు చెప్పుకొచ్చారు.
ఆగస్టు తొలి వారంలో పుష్ప 2 షెడ్యూల్ షూటింగ్ ప్రారంభమవుతుందని, ఈసారి చెప్పిన సమయానికి సినిమా రిలీజ్ అవుతుందన్నారు బన్నీ వాసు.
ఇక్కడ క్లిక్ చేయండి..