15 November 2023
బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరిలో లక్కీ ఫెలో.! లేకపోతే ఆ ఛాన్స్ ఎలా వస్తుంది.?
వైల్డ్ కార్డ్‌తో.. ఈ సీజన్ బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అర్జున్.. తన గేమ్‌తో.. అందర్నీ ఆకట్టుకుంటున్నాడు.
తన స్టైల్లో చాలా సెటిల్డ్‌గా టాస్కులు ఆడుతూ.. బీబీ ఆడియెన్స్ మనసులు గెలుచుకుంటున్నాడు.
ఇక ఈ క్రమంలోనే తాజాగా జరిగిన దివాలీ ఎపిసోడ్‌లో... ఒంపర్ ఆఫర్ గెలుచుకున్నాడు అర్జున్.
ఏకంగా యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబే నోటి నుంచే.. నువ్వు చరణ్ సినిమాలో కీ రోల్ చేస్తున్నావ్ అనే మాట వచ్చేలా చేసుకున్నాడు.
ఆ మాటతో షోలో.. హోస్ట్ నాగార్జున ముందు ఎగిరిగంతేసినంత పని చేశాడు.
ఇక ఉప్పెన ఫేం బుచ్చిబాబు సనా డైరెక్షన్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ సినిమా చేస్తున్నారు.
వీరు చేసే సినిమా.. ఓ మట్టి కథ అంటూ వచ్చిన లీక్‌తో.. తెలుగు టూ స్టేట్స్‌లో హాట్ టాపిక్ అయ్యారు.
అయితే ఈసినిమాలో.. ఓ క్యారెక్టర్ ఛాన్స్ కోసం ఎప్పటి నుంచో అర్జున్ ట్రై చేస్తున్నాడట.
ఇక ఇది తెలిసిన బుచ్చిబాబు.. నేరుగా బిగ్ బాస్ వేదిక మీదగానే.. అర్జున్‌కు క్యారెక్టర్ ఛాన్స్ ఇచ్చేశారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి