బ్రహ్మనందం కుమారుడు రాజ గౌతమ్ ఏం చేస్తాడో తెలుసా

పల్లకిలో పెళ్లి కూతురు సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమాతో గుర్తింపు వచ్చినా అంతగా ఫేమ్ రాలేదు.

 ఆ తర్వాత బసంతి, చారుశీల, మను లాంటి చిత్రాల్లో కనిపించారు.

అలా అడపాదడపా సినిమాలు చేసుకుంటూ వస్తున్న గౌతమ్.. తాజాగా బ్రేక్ అవుట్ అనే సినిమా ద్వారా మన ముందుకు రాబోతున్నాడు.

అయితే గౌతమ్‌కు సినిమాల్లో నటించడం అసలు డ్రీమ్ కాదట. మరీ రాజ గౌతమ్ సినిమాలు కాకుండా ఏం చేస్తాడో మీకు తెలుసా?

కేవలం టైమ్ పాస్ కోసమే సినిమాలు చేస్తుంటాడని టాక్ వినిపిస్తోంది. ఆయన అసలు వృత్తి వ్యాపారం.

గౌతమ్‌కు హైదరాబాద్‌లో కమర్షియల్ కాంప్లెక్స్‌లతో పాటు ప్రముఖ ఎంఎన్‌సీ కంపెనీలలో పెట్టుబడులు కూడా పెట్టారట.

అంతేకాకుండా బెంగళూరులోనూ చాలా రెస్టారెంట్స్ కూడా ఉన్నాయట.

కేవలం వాటి ద్వారానే నెలకు రూ.30 కోట్ల రూపాయిల ఆదాయం ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఇంత సంపాదన వస్తే ఇంకా సినిమాల్లో నటించాల్సిన అవసరమేముంది మీరే చెప్పండి.

ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు సినిమాలు చేస్తుంటాడని చెబుతున్నారు అంతే.