స్టార్ హీరోలు కూడా బ్రేక  చేయలేని బ్రహ్మి అరుదైన రికార్డ్ 

Phani.ch

03 June 2024

ప్రముఖ టాలీవుడ్ కమెడియన్ బ్రహ్మానందం  గురించి తెలుగు ప్రజలకు  ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

తెలుగు సినిమా చరిత్రలో ఎన్నో హిట్ సినిమాల విజయాలలో  బ్రహ్మానందం పాత్ర ఉంటుంది. టాలీవుడ్ కమెడియన్ కాగా 1150కు పైగా సినిమాలలో నటించారు బ్రహ్మి.

ఇది ఇలా ఉంటే మన హాస్యనటుడు బ్రహ్మానందం పేరుపై ఉన్న ఒక రేర్ రికార్డ్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

1993 సంవత్సరంలో హాస్య నటుడు బ్రహ్మానందం ఇన్ని సినిమాలలో నటించి అరుదైన రికార్డ్ ను తన ఖాతాలో వేసుకున్నారు .

ఆ రేర్ రికార్డ్  ఏంటంటే బ్రహ్మానందం ఒకే ఏడాది ఏకంగా 51 సినిమాలలో నటించడం గమనార్హం. ఈ రికార్డ్ ఎప్పటికీ బ్రేక్ కాని రికార్డ్ అని ఇందులో ఎలాంటి సందేహం  అక్కర్లేదు.

బ్రహ్మానందం ఒకానొక సమయంలో తన ఒక్కో సినిమా రెమ్యునరేషన్ కు సంబంధించిన విషయాల ద్వారా కూడా వార్తల్లో వైరల్ అయ్యారు

బ్రహ్మానందం ప్రతి సినిమాకు రోజుకు 10 లక్షల రూపాయల రేంజ్ లో పారితోషికం అందుకున్న నటులలో ఒకరు కావడం గమనార్హం.