27 July 2025

అందాలతో గత్తరలేపుతున్న రుద్రాణి అత్త.. సెగలు పుట్టిస్తోన్న బ్యూటీ

Rajitha Chanti

Pic credit - Instagram

బుల్లితెరపై హీరోయిన్ రేంజ్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. కనిపించేది విలన్ పాత్రే అయినా అందంలో హీరోయిన్లకు పోటీ ఇస్తుంది. 

సీరియల్స్ ద్వారా బుల్లితెరపై మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ వయ్యారి.. తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి. 

హీరోయిన్లకు మించిన గ్లామర్ ఫోజులతో మెస్మరైజ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ.. సీరియల్స్ లో మాత్రం విలన్ పాత్రలతో ఫేమస్ అవుతుంది.

ఆమె మరెవరో కాదు.. బ్రహ్మముడి సీరియల్ ఫేమ్ రుద్రాణి అత్త అలియాస్ షర్మిత గౌడ. ఇందులో విలన్ పాత్రలో కనిపిస్తుంది షర్మిత. 

రుద్రాణి అత్తగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అద్భుతమైన నటనతో కట్టిపడేస్తుంది. ఈ సీరియల్లో రాజ్, కావ్యలతోపాటు భారీగా ఫాలోయింగ్ ఉంది. 

బెంగుళూరుకు చెందిన షర్మిత గౌడ కన్నడలో అనేక సీరియల్స్ చేసింది. బ్రహ్మాముడి సీరియల్ తో తెలుగు తెరకు పరిచయమైంది. 

ఇప్పుడు తెలుగులో ఫ్యామిలీ అడియన్స్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న నటి షర్మిత. ప్రస్తుతం ఆమె వయసు కేవలం 32 సంవత్సరాలు మాత్రమే. 

సీరియల్లో చీరకట్టులో కనిపిస్తూనే మోడ్రన్ లుక్‏లో కట్టిపడేస్తుంది. తాజాగా షర్మిత షేర్ చేసిన ఫోటోస్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.