21 July 2024
తస్సాదియ్యా.. చీరకట్టులో రుద్రాణి అత్త స్టైలే వేరప్పా..
Rajitha Chanti
Pic credit - Instagram
బుల్లితెరపై అందంతోపాటు విలనిజంతోపాటు అరాచకం సృష్టిస్తోంది బ్రహ్మాముడి సీరియల్ నటి రుద్రాణి అత్త అలియాస్ షర్మిత గౌడ.
బ్రహ్మముడి సీరియల్లో రుద్రాణిగా నటిస్తున్న షర్మితగౌడ.. కుటుంబంలో చిచ్చుపెట్టే పాత్రలో అద్భుతమైన నటనతో కట్టిపడేస్తుంది షర్మిత.
సీరియల్లో చీరకట్టులోనే మోడ్రన్ స్టైల్లో తెలుగు బుల్లితెర అడియన్స్ ఫేవరేట్ నటిగా మారింది. తాజాగా షర్మిత శారీ లుక్స్ ఆకట్టుకుంటున్నాయి.
సోషల్ మీడియాలో షర్మిత గౌడ చాలా యాక్టివ్గా ఉంటుంది. చీరకట్టులోనే కాదు.. మోడ్రన్ డ్రెస్సులలోనూ గ్లామరస్ పిక్స్ షేర్ చేస్తుంటుంది.
తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన శారీ లుక్స్ ఫోటోస్ పై నెటిజన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. అచ్చం హీరోయిన్లా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం బ్రహ్మముడి సీరియల్లో అత్త పాత్రలో రుద్రాణి వయసు చిన్నదే. ఇదే సీరియల్లో హీరోగా నటిస్తున్న మానస్ కంటే షర్మిత వయసు 32 ఏళ్లే.
1990 నవంబర్ 20న జన్మించిన షర్మిత గౌడ.. 2017లో మిస్ కర్ణాటకగా గెలిచింది. వయసుతో సంబంధం లేకుండా పాత్రలు పోషిస్తుంది షర్మిత.
షర్మితకు ఇన్ స్టాలో చాలా ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం 166K ఫాలోవర్స్ ఉండగా.. తాజాగా తన కొడుకు, కూతురి ఫోటోస్ షేర్ చేసింది రుద్రాణి.
ఇక్కడ క్లిక్ చేయండి.