16 November 2025
సీరియల్లో అత్త.. నెట్టింట గ్లామర్ వయ్యారం.. హీరోయిన్ మెటీరియల్ గురూ
Rajitha Chanti
Pic credit - Instagram
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు ఆమె సుపరిచితమైన నటి. సీరియల్లో అత్తగా, నెగిటివ్ షేడ్స్ ఉన్న విలన్ పాత్రలో నటిస్తుంది.
కానీ సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ వయ్యారంతో అరాచకం సృష్టిస్తుంది. ఇప్పుడు బుల్లితెరపై అందమైన సీరియల్ విలన్ అంటే ఆమె.
ఆమె మరెవరో కాదండి.. షర్మిత గౌడ. గుర్తుపట్టారా.. ? అదేనండి.. బ్రహ్మముడి సీరియల్‌లో రుద్రాణిగా నటిస్తోన్న కన్నడ ముద్దుగుమ్మ షర్మిత గౌడ
ఈ సీరియల్లో నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్‌లో అదరగొడుతోంది. విలన్ క్యారెక్టర్ అయినా గ్లామర్ సొగసులతో కట్టిపడేస్తుంది ఈ వయ్యారి.
సీరియల్‌లో విలన్‌గా కనిపించే షర్మిత గౌడ...సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ ఫొటోలను పోస్ట్ చేస్తూ అభిమానులను సర్‌ప్రైజ్ చేస్తుంది.
బ్రహ్మముడి కంటే ముందు ఆమె కన్నడలో గీత, నీలా, మంగళ గౌరీ మాధువే, జానకి రాఘవ అనే కన్నడ సీరియల్స్‌లో షర్మిత గౌడ నటించింది.
ఇప్పుడు తెలుగులో బ్రహ్మముడి సీరియల్ చేస్తుంది. షర్మిత గౌడ వారానికి ఏడు లక్షల వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం.
మోడల్‌గా షర్మిత గౌడ కెరీర్ ప్రారంభమైంది. 2017లో మిస్ కర్ణాటక టైటిల్ గెలుచుకుంది. ఇప్పుడు కన్నడ, తెలుగులో వరుస సీరియల్స్ చేస్తుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్