28 August 2025

అబ్బబ్బో.. సెగలు పుట్టిస్తోన్న లేడీ విలన్.. ఈ బ్యూటీ క్రేజ్ చూస్తే

Rajitha Chanti

Pic credit - Instagram

సీరియల్ బ్యూటీలకు ఇప్పుడు ఏ స్థాయిలో క్రేజ్ ఉంటుందో చెప్పక్కర్లేదు. హీరోయిన్లకు సమానంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంటున్నారు. 

ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని.. సీరియల్లో విలన్ పాత్రలు పోషించిన ముద్దుగుమ్మలకు నెట్టింట ఓ రేంజ్ క్రేజ్ సంపాదించుకుంటున్నారు.

తాజాగా ఓ సీరియల్ విలన్ నెట్టింట అందాల బీభత్సం సృష్టిస్తుంది. చీరకట్టులో అలరించిన ఈ అమ్మడు.. గ్లామరస్ ఫోటలతో సెగలు పుట్టిస్తోంది.

ఆమె మరెవరో కాదండి.. బ్రహ్మాముడి ఫేమ్ రుద్రాణి అలియాస్ షర్మిత గౌడ. ఈ సీరియల్లో అటు తల్లిగా, ఇటు అత్త పాత్రలో నటిస్తూ మెప్పిస్తున్నారు. 

బ్రహ్మాముడి సీరియల్లో ఈ అమ్మడు పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అయినా చీరకట్టులో మోడ్రన్ గా కనిపిస్తుంది. 

విలన్ పాత్రలో తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఆమె.. ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం గ్లామరస్ పాత్రలతో రచ్చ చేస్తుంది. 

చీరకట్టులో ఆకట్టుకుంటూనే ఇటు మోడ్రన్ డ్రెస్సులలో మెప్పిస్తుంది. నెట్టింట చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం రకరకాల ఫోటోలతో మెప్పిస్తుంది. 

తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ బ్యూటీ గ్లామర్ ఫోజులు చూసి షాకవుతున్నారు నెటిజన్స్.