నేను దిగితే మిగిలేదుండదు అంటూ రామ్.. అదిరిపోయే టైటిల్ ఖరారు..

బోయపాటి శ్రీను రామ్ కాంబోలో పోతినేని ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

ఈ మూవీలో రామ్ సరసన శ్రీలీల నటిస్తుంది.

బోయపాటిరేపో వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు.

తాజాగా సోమవారం ఈ చిత్రం టైటిల్ ని ప్రకటించింది చిత్ర బృందం.

ఈ చిత్రానికి స్కంద అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలిపారు మూవీ మేకర్స్.

ఈ విషయాన్ని తెలుపుతూ ఓ  టైటిల్ గ్లింమ్స్ ను కూడా విడుదల చేశారు.

అందులో రామ్ గుబురు గడ్డంతో న్యూ లుక్ లో ఆకట్టుకున్నారు.

మీరు దిగితే ఊడేదుండదు  లేదు.. నేను దిగితే మిగిలేదుండదు అంటూ మాస్ డైలాగ్స్ తో అదరగొట్టారు రామ్.

ఈ చిత్రానికి థమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు.