అఖండ 2 అప్పుడే.. 

TV9 Telugu

17 April 2024

నందమూరి నట సింహ బాలకృష్ణ హీరోగా ద్విపాత్రాభినయం చేసిన టాలీవుడ్ ఇండస్ట్రీ యాక్షన్ డ్రామా సినిమా అఖండ.

బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని మూటగట్టుకుంది. ప్రగ్య జైస్వాల్ కథానాయక.

ద్వారకా క్రియేషన్స్ పతాకంలో మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎస్ఎస్ థమన్ దీని సంగీతం అందించారు.

ఇందులో అఘోరా పాత్రలో బాల్లయ్య తన నట విశ్వరూపం చూపించారు. ఇందులో శ్రీకాంత్ విలన్ పాత్రలో ఆకట్టుకున్నారు.

బ్లాక్ బస్టర్ అఖండ సినిమాలో సీనియర్ హీరో జగపతి బాబు, టాలీవుడ్ నటి పూర్ణ కీలక పాత్రల్లో మెప్పించారు.

బాలయ్య అఖండ సినిమాకు సీక్వెల్‌ ఉంటుందని గత కొన్నాళ్లుగా సోషల్ మీడియా వేదికగా వార్తలు వైరల్‌ అవుతున్నాయి.

తాజాగా యాక్షన్ సినిమా అఖండ సీక్వెల్‌ స్టోరీ గురించి స్పందించారు టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను.

సామాజిక అంశాలతో పార్ట్ 2ని తెరకెక్కిస్తామని చెప్పారు. ఎన్నికల తర్వాత పూర్తి వివరాలను ప్రకటిస్తామని అన్నారు.