11 January 2024

హృతిక్ ఆస్తులు తెలిస్తే.. కళ్లు తిరిగిపోవాల్సిందే

TV9 Telugu

జానవరి 10న బాలీవుడ్ సూపర్ హీరో హృతిక్ రోషన్ పుట్టిన రోజు.  ఇక హృతిక్ ఆస్తుల వివరాలు తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.

హృతిక్ రోషన్ఆ స్తులు ఏకంగా 3,101 కోట్లకు పైగా ఉన్నాయి. సినిమాకు 75 కోట్ల నుంచి 100 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటాడు హృతిక్.

బ్రాండ్ ప్రమోషన్ కోసం హృతిక్ రోషన్ 10-12 కోట్లు వసూలు చేస్తాడు.

ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రమోట్ చేయడానికి హృతిక్ ఒక్కో పోస్ట్‌కు 4-5 కోట్ల రూపాయలు అందుకుంటాడు.

హృతిక్ HRX బ్రాండ్‌ను ప్రారంభించాడు. ఈ కంపెనీ విలువ 200 కోట్ల రూపాయల కంటే ఎక్కువ.

అలాగే హృతిక్ రోషన్ కు ముంబైలోని జుహులో 97.50 కోట్ల రూపాయల డూప్లెక్స్ హౌస్‌ ఉంది. అతనికి జుహులో 67 కోట్ల పెంట్‌హౌస్ ఉంది.

అతనికి జుహూలో 32 కోట్ల విలువైన మరో అపార్ట్‌మెంట్ ఉంది. లోనోవాలాలో 7 ఎకరాలలో ఫామ్‌హౌస్ ఉంది. దాని ధర వందల కోట్లు ఉంటుంది.

అంతే కాదు హృతిక్ రోషన్ దగ్గర చాలా లగ్జరీ కార్ కలెక్షన్ ఉంది. అతని వద్ద BMW కారు ఉంది. ముస్టాంగ్, మెర్సిడెస్ అలాగే ఇతర లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి.