కల్యాణ వైభోగమే.. సోనాక్షి సిన్హా పెళ్లి ఫోటోలు వైరల్.

Anil Kumar

26 June 2024

బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా తన మిత్రుడు జహీర్‌ ఇక్బాల్‌ తో వివాహం ఇంట్లోనే  సింపుల్ గా జరిగింది.

వీరిద్దరూ సింపుల్ గా రిజిస్టర్‌ మేరేజ్‌తో , దండలు మార్చుకొని ఒక్కటయ్యి.. వివాహబంధంలోకి అడుగుపెట్టారు.

వీరి వివాహ వేడుకకు.. ఇరువురి కుటుంబ సభ్యులతో పాటు మరి కొంతమంది సన్నిహిత మిత్రులు మాత్రమే హాజరయ్యారు.

వివాహానంతరం తమ పెళ్లి ఫోటోలను సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.. హీరోయిన్ సోనాక్షి సిన్హా.

ఈ నూతన దంపతులకు పలువురు ప్రముఖులు, నటీ , నటీమణులు.. సోషల్‌ మీడియా వేదికగా తమ శుభాకాంక్షలు అందజేశారు.

ఇదిలా ఉంటె.. డబుల్‌ ఎక్సెల్‌ సినిమాలో నటిస్తున్నప్పుడు వీరి మధ్య ప్రేమ పుట్టింది అని పలుమార్లు తెలిపారు.

'ఏడేళ్ల క్రితమే మేం ప్రేమలో పడిపోయాం అని.. ఆ ప్రేమను నిలబెట్టుకోవాలని అప్పుడే నిర్ణయించుకున్నాం అని తెలిపారు.

ఇప్పుడు వివాహ బంధంతో ఒక్కటైనందుకు ఆనందంగా ఉందని..' తన ఇంస్టాగ్రామ్ వేదికగా తెలిపారు సోనాక్షి సిన్హా.