సైలెంట్‌గా మొదలైన రామాయణం.. ఆహాలో సుడిగాలి..
TV9 Telugu
06 April 2024
చాలా రోజులుగా సోషల్ మీడియా చర్చల్లో ఉన్న బాలీవుడ్ ఇండస్ట్రీ రామాయణ సినిమా ఎట్టకేలకు సైలెంట్‌గా మొదలైంది.
ఈ సినిమాను దాదాపు 1000 కోట్ల భారీ బడ్జెట్ తో 3 భాగాలుగా ప్లాన్ చేస్తున్నారు బాలీవుడ్ దర్శకుడు నితేష్ తివారీ.
ఇందులో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్ నటిస్తున్నారు. ఈ సినిమా ఓపెనింగ్ ముంబైలో జరిగింది.
మొదటి షెడ్యూల్ మొదలైంది.. త్వరలోనే రణ్‌బీర్, సాయి పల్లవి సెట్స్‌లో జాయిన్ కానున్నారు. 2025 డిసెంబర్‌లో రామాయణ 1 రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు.
బుల్లితెరపై యాంకర్‌గా, హాస్య నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సుడిగాలి సుధీర్. హీరోగానూ నటిస్తున్నారీయన.
తాజాగా ఆహాలో ప్రసారం అవుతున్న సర్కార్ సీజన్ 4కి హోస్ట్‌గా వ్యవహరించనున్నారు జబర్దస్త్ కమెడియన్ సుధీర్.
ఈ విషయాన్ని అధికారికంగా కన్ఫర్మ్ చేస్తూ పోస్టర్ విడుదల చేసారు షో నిర్వాహకులు. ముందు మూడు సీజన్లు ప్రదీప్ హోస్ట్ చేసారు.
ప్రస్తుతం సుధీర్ హీరోగా నటిస్తున్న చిత్రం G.O.A.T. ఇందులో క్రేజీ హీరోయిన్ దివ్య భారతి ఆయనకి జోడిగా నటిస్తుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి