పాత వీడియోతో సాయి పల్లవిపై ట్రోలింగ్.. వారి పనేనా?

26 October 2024

Basha Shek

శివ కార్తికేయన్‌- సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం 'అమరన్‌'.  తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 31న ఈ మూవీ విడుదలవుతోంది

మేజర్ ముకుందన్ జీవితంలోని కొన్ని సంఘటనలను తీసుకుని దర్శకుడు   రాజ్‌కుమార్‌ పెరియస్వామి ఈ సినిమాను తెరకెక్కించాడు

అయితే, ఈ సినిమా రిలీజ్ నేపథ్యంలో కొందరు సాయిపల్లవిని టార్గెట్‌ చేస్తూ నెట్టింట తప్పుడు ప్రచారం చేస్తున్నారు

సుమారు రెండేళ్ల క్రితం  సాయి పల్లవి ఇచ్చిన ఇంటర్వ్యూలోని కొంత భాగాన్ని కట్ చేస్తూ న్యాచురల్ బ్యూటీని ట్రోల్ చేస్తున్నారు.

ఇటీవల బాలీవుడ్‌ నుంచి ఓ వ్యక్తి  తన ఇమేజ్‌ను మరింత పెంచుతామంటూ పీఆర్‌ ఏజెన్సీ సాయి పల్లవిని సంప్రదించారట.

అయితే, దానిని సాయి పల్లవి రిజెక్ట్ చేసిందట. దీంతో ఇప్పుడు వారే సాయి పల్లవిని టార్గెట్‌ చేశారని సమాచారం.

కాగా  ‘రామాయణ’ సినిమాతో బాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తోంది సాయి పల్లవి. ఇందులో ఆమె సీత పాత్రలో కనిపించనుంది.

ఇప్పుడు కొందరు ఈ వీడియోను షేర్‌ చేస్తూ.. సీత పాత్రలో సాయి పల్లవిని తొలగించాలంటూ కామెంట్లు పెడుతున్నారు.