ఎన్టీఆర్ దేవర మీద ఫోకస్ చేస్తుంటే, బాలీవుడ్ మాత్రం సిన్సియర్‌గా తారక్‌ని టార్గెట్ చేస్తోంది. ఒకటి కాదు, రెండు కాదు, స్పెషల్ సినిమాలు ఏం వచ్చినా అక్కడ తారక్ పేరు గట్టిగానే వినిపిస్తోంది.
హృతిక్‌తో ఆల్రెడీ తారక్ సినిమా చేస్తున్నారు. మరి సల్మాన్‌తోనూ, షారుఖ్‌తోనూ చేస్తున్నారంటున్న మూవీస్ మాటేంటి? ముందున్నదంతా చాలెంజింగ్ పీరియడేనా తారక్?
నేనేం చేసినా అభిమానుల కోసమే. వాళ్లు నా ప్రతి అడుగులో ఉన్నారంటూ రీసెంట్‌గా ఎమోషనల్ అయ్యారు తారక్. మీరు దేవర మీద ఫోకస్ చేయండి.
మీ వెనుక మేం ఉన్నామనే భరోసాను తమ హీరోకు స్ట్రాంగ్‌గా ఇస్తోంది తారక్ సైన్యం. ఆ ధైర్యంతోనే ఆయన వార్2లో హృతిక్‌తో తలపడుతున్నారు.
ఈ సినిమాలోనే క్లైమాక్స్ లో తారక్ ఎక్స్ టెంటెడ్ కేమియో అప్పియరెన్స్ ఇస్తారన్నది నందమూరి అభిమానుల్లో గూస్‌బంప్స్ తెప్పిస్తున్న వార్త.
టైగర్ 3 తర్వాత సల్మాన్, షారుఖ్ కలిసి నటించబోయే టైగర్ వర్సెస్ పఠాన్‌లోనూ యంగ్‌టైగర్ నటిస్తారన్నది లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్త. ఈ సినిమాలో తారక్‌తో పాటు హృతిక్ కూడా కీ రోల్ చేస్తారట.
నార్త్ మొత్తం తారక్ గెస్ట్ అప్పియరెన్సుల గురించి మాట్లాడుతుంటే, సౌత్ మాత్రం దేవర మీద ఫోకస్ చేస్తోంది. దేవర సినిమాలో తారక్ ఓల్డ్ లుక్‌లో ఎలా ఉంటారో చూడాలన్నది చాలా మందిని ఊరిస్తున్న విషయం.