ఇప్పటికే శంకర్ డైరెక్షన్లో.. 'గేమ్ చేంజర్'తో తెగ బిజీగా ఉన్న చెర్రీ.. తన నెక్ట్స్ సినిమాకు సంబంధించిన అప్టేట్‌తో నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు.
బుచ్చిబాబు సనా డైరెక్షన్లో RC16 వర్కింగ్ టైటిల్‌తో సినిమా చేస్తున్న చెర్రీ..ఆ సినిమాలో బాలీవుడ్ స్టార్‌ను ఢీకొట్టబోతున్నారట.
జాకీ ష్రాఫ్ తనయుడు.. హీరోగా ఇప్పటికే బాలీవుడ్లో స్టార్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న టైగర్ ష్రాఫ్ చెర్రీ సినిమాలో యాక్ట్ చేయబోతున్నారట.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు పవర్ ఫుల్ విలన్‌గా తన స్టామినా ఏంటో చూపించబోతున్నారట బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్.
ఎస్ ! బుచ్చిబాబు క్రియేట్ చేసిన పవర్ ఫుల్ విలన్ రోల్ టైగర్‌కు నచ్చడంతో.. RC16 సినిమాలో ఆయన విలన్‌గా చేసేందుకు ఓకే చెప్పారట.
తన అపోనెంట్‌గా మెగా పవర్ స్టార్ చేస్తుండడం కూడా.. టైగర్ ష్రాఫ్ ఈ సినిమా ఒప్పుకునేందుకు మరో కారణమట.
ఇక ఇప్పటికే టైగర్ ష్రాఫ్ తండ్రి జాకీ ష్రాఫ్ కూడా విలన్‌గానే సినిమాలు చేస్తున్నారు. విలన్‌గా కొన్ని చిత్రాల్లో మెప్పించారు.
తండ్రి బాటలో.. ఇప్పుడు కొడుకు కూడా నడిచేందుకు రెడీ అయ్యారు. అయితే అందుకు చెర్రీ సినిమాను పిక్ చేసుకుని త్రూ అవుట్ ఇండియా ఈ న్యూస్ తో వైరల్ అవుతున్నారు.