TV9 Telugu
దారుణంగా షారుఖ్ డంకీ కలెక్షన్స్.!
25 December 2023
బాలీవుడ్ బాద్ షా ఈ ఏడాది బ్యాక్ టూ బ్యాక్ హిట్స్‌తో ఫుల్ జోష్ మీదున్నాడు. వరుసగా రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ ఖాతాలో వేసుకున్నాడు.
ఇప్పుడు ‘డంకీ’ సినిమాతో మరోసారి అడియన్స్ ముందుకు వచ్చాడు బాద్ షా.
డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణి దర్శకత్వంలో షారుఖ్ నటించిన ఈ కామెడీ ఎంటర్టైనర్ డిసెంబర్ 21న హిందీలో విడుదలైంది.
అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన డంకీ సినిమా బాక్సాఫీస్ అంతగా సెన్సెషన్ సృష్టించలేకపోయింది.
ట్రేడ్ వర్గాల ప్రకారం డంకీ సినిమా దేశవ్యాప్తంగా మొత్తం 30 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది.
అంతకు ముందు అట్లీ దర్శకత్వంలో షారుఖ్ నటించిన జవాన్ సినిమా మొదటి రోజు 89.5 కోట్లు రాబట్టగా.. పఠాన్ సినిమా 57 కోట్లు రాబట్టింది.
కానీ ఈ రెండు సినిమాల కంటే అతి తక్కువ కలెక్షన్స్ రాబట్టింది డంకీ. ఇక రిలీజ్ 1స్ట్ డే.. డంకీ సినిమా మొత్తం 29.94% ఆక్యుపెన్సీ అందుకుంది.
ఇది దాదాపు 29.75% ఆక్యుపెన్సీ ఉన్నట్లు. కానీ డంకీ ఫస్ట్ డే కలెక్షన్స్ గురించి ఇప్పటి వరకు మేకర్స్ అయితే అధికారికంగా ప్రకటించలేదు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి