TV9 Telugu

02 January 2024

58 ఏళ్ల వయసులో అవసరమా హీరో అంటున్న నెటిజన్స్.

బాలీవుడ్ స్టార్‌ హీరో ఆమిర్ ఖాన్ ఇప్పుడు నటనకు దూరంగా ఉన్నాడు .

‘లాల్ సింగ్ చద్దా’ సినిమా పరాజయం తర్వాత సినిమాల నుంచి బ్రేక్‌ తీసుకున్నాడు మిస్టర్‌ పర్‌ఫెక్షనిస్ట్‌.

ఈ హీరో ఖాళీ సమయంలో సరికొత్త కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నారట ఆమిర్‌ ఖాన్‌.

ఆశ్చర్యకరంగా ఆయన ఇప్పుడు శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటున్నారట.

అయితే ఇదే ఇప్పుడు అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది. ఇప్పుడు ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుంది.

58 సంవత్సరాల వయస్సులో షారుఖ్ క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకుంటున్నారట. ఎంతో ఉత్సాహంతో ప్రాక్టీస్‌ చేస్తున్నాడట.

అయితే ఆమిర్‌ ఖాన్‌ సడెన్‌గా శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడానికి కారణేమంటో తెలియడం లేదు.

తన తదుపరి సినిమా కోసమే ఆయన క్లాసికల్‌ మ్యూజిక్‌ నేర్చుకుంటున్నారని బాలీవుడ్‌ లో టాక్‌ వినిపిస్తోంది.