జాతీయ అవార్డును వారికి అంకితం చేసిన బాలీవుడ్ దర్శకుడు..

19 October 2023

తను తీసిన సినిమాలతో కంటే... తన మాటలతోనే ఎక్కువగా హాట్ టాపిక్ అవుతుంటాడు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి.

కాశ్మీరీ ఫైల్స్ సినిమాతో.. ఒక్క సారిగా సెన్సేషన్ అయిన ఈ డైరెక్టర్‌.. ఆ తరువాత చాలా కాంట్రో కామెంట్స్ చేశాడు.

అందులోనూ.. తనకు ఎలాంటి సంబంధం లేని ప్రభాస్‌ పై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డాడు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి.

తన కాశ్మీరీ ఫైల్స్ సినిమాతో పోలుస్తూ.. ప్రభాస్‌ సినిమాలు సినిమాలే కావని.. ఇంటర్వ్యూలో మాట్లాడాడు ఆయన.

ఆదిపురుష్ సినిమాపై.. ఆ సినిమాలోని ప్రభాస్‌ అవతార్‌ పై .. కూడా షాకింగ్ కామెంట్స్ చేశాడు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి.

అలాంటి కాంట్రో డైరెక్టర్‌ వివేక్ అగ్నిహోత్రికు.. ఆయన సినిమాకు 69వ జాతీయ అవార్డుల్లో.. ప్రముఖ స్థానం లభించింది.

కాశ్మీరీ ఫైల్స్ సినిమాను 'నర్గిస్ దత్‌ అవార్డ్ ఫర్ బెస్ట్ ట్రూ ఫిల్మ్ ఆన్‌ నేషనల్ ఇంటిగ్రిటీ' అవార్డ్‌ వరించింది.

దీంతో మరో సారి అటు సోషల్ మీడియాలోనూ.. ఇటు బాలీవుడ్‌ ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్‌ అవుతున్నారు వివేక్ అగ్నిహోత్రి.