పుష్ప2పై బాలీవుడ్ డైరక్టర్ ప్రశంసలు..
TV9 Telugu
17 April 2024
అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం పాన్ ఇండియా లెవెల్ యాక్షన్ ఎంటర్టైనర్ పుష్ప 2 ది రూల్.
పుష్ప 1 ది రైజ్ సినిమాకి కొనసాగింపుగా వస్తున్న ఈ చిత్రన్నీ ప్రముఖ దర్శకుడు సుకుమార్ భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు.
మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ నటుడు జగపతిబాబు కూడా భాగం కానున్నారు. ఫహద్ ఫాసిల్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.
ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమాపై ఓ ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ప్రశంసలు కురిపించారు.
పుష్ప 2 ది రూల్ సినిమా బంపర్ హిట్ కావాలని కోరారు హిందీ బ్లాక్ బస్టర్ సినిమా గదర్2 డైరక్టర్ అనిల్ శర్మ.
బన్నీ పుట్టినరోజు నాడు విడుదలైన పుష్ప ది రూల్ టీజర్‌ను చుసిన అయన అద్భుతంగా ఉందని ప్రశంసలు కురిపించారు.
గతేడాది ఆగస్టు 15న తన గదర్2 విడుదలై మంచి విజయం సాధించిందని, పుష్ప2 సినిమా అంతకన్నా పెద్ద హిట్ కావాలని అన్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి