TV9 Telugu
21 February 2024
విద్యాబాలన్ పేరు చెప్పి భారీ వసూళ్లు.! పోలీసులను ఫిర్యాదు చేసిన నటి.
బాలీవుడ్ ప్రముఖ నటి విద్యాబాలన్ పోలీసులను ఆశ్రయించింది. విద్యాబాలన్ పేరు చెప్పి ప్రజలను మోసం చేశారు.
విద్యాబాలన్ పేరిట నకిలీ సోషల్ మీడియా ఖాతాలను క్రియేట్ చేసి కొందరు అక్రమార్కులు డబ్బులు వసూలు చేయడం ప్రారంభించారు.
చాలా రోజులుగా జరుగుతున్న మోసం గురించి నటికి ఆలస్యంగా తెలిసింది. దీంతో ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.
నిందితుడి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. బాలీవుడ్‌లో లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ విద్యాబాలన్.
ఈ నేపథ్యంలోనే ఆమె పేరుతో నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా తెరిచిన దుండగులు ప్రజల నుంచి డబ్బులు దండుకుంటున్నారు.
విద్యాబాలన్ పేరును చెడగొడుతున్నారు. ప్రజల నుంచి డబ్బులు దండుకోవాలనే ఉద్దేశంతో దుండగులు ఈ- మెయిల్ ఖాతాను కూడా తెరిచారు.
దాని ద్వారా చాలా మందికి సందేశం పంపాడు. సినీ పరిశ్రమలోని ప్రముఖులను కూడా మోసం చేసేందుకు ప్రయత్నించారు.
ఇక సినిమాల విషయానికి వస్తే విద్యాబాలన్ ఇటీవల కాలంలో చాల జాగ్రత్తగా మూవీస్ ను ఎంపిక చేసుకుంటోంది అనే చెప్పాలి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి