TV9 Telugu
26 February 2024
దిమ్మతిరిగే రెమ్యూనిరేషన్ తో జక్కన్నను భయపెట్టిన బాలీవుడ్ స్టార్.
తెలుగు సినిమా స్థాయి ప్రపంచవ్యాప్తంగా దూసుకుపోతుంది. ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ చిత్రాలను చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
పాన్ ఇండియా సినిమాలకు కేరాఫ్‌గా సౌత్ మూవీస్ మారడంతో ఆ సినిమాలు చేసేందుకు బాలీవుడ్ యాక్టర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
ఇదిలా ఉంటె అప్పట్లో ట్రిపుల్ ఆర్ కోసం బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్‌గన్ రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.
తారక్ , రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ మూవీలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ సినిమాలో అతిథి పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే.
ట్రిపుల్ ఆర్ మూవీలో కేవలం 8 నిమిషాల పాటు వచ్చే ఆ సీన్‌లో అజయ్ దేవగన్ క్యారెక్టర్ చాలా కీలకం అనే చెప్పాలి.
ఆ సీన్‌లో నటించినందుకు అజయ్ దేవగన్ 35 కోట్లు పారితోషికం తీసుకున్నాడంటూ ఇండస్ట్రీ వర్గాల నుండి సమాచారం.
8 నిమిషాల సీన్ లో నిమిషానికి 4.5 కోట్లు చొప్పున 8 నిమిషాలకు గాను 35 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది.
సాధారణంగా అజయ్ ఒక్కో సినిమాకు రూ. 35 కోట్ల పారితోషికం తీసుకుంటున్నారు. అలాగే మూవీ లాభాల్లో అతడికి 50 శాతం ఇవ్వనున్నారట.
ఇక్కడ క్లిక్ చెయ్యండి